ఢిల్లీలోని శాంగ్రిలా హోటల్లో రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య వాగ్వాదం జరిగినట్లు వస్తున్న వార్తలను అందోల్- జోగిపేట మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఆయన కొట్టిపారేశారు.
ఢిల్లీలోని ప్రముఖ శాంగ్రిలా హోటల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య వాగ్వాదం జరిగిందంటూ మీడియాలో వస్తున్న కథనాలను అందోల్- జోగిపేట మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన సోమవారం స్పందిస్తూ, మంత్రి దామోదర రాజనర్సింహపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కొట్టిపారేశారు. ఈ సందర్భంగా ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. మా నాయకుడి పైన లేనిపోని వార్తలను ఎవ్వరూ నమ్మరని, ఏదైనా అభివృద్ధి పైన గానీ, సంక్షేమ పథకాల పైన చర్చ పెడితే బాగుంటుందని, అందోల్ నియోజకవర్గంలో రూ. 2,000 కోట్లకు పైబడి అభివృద్ధి పనులు సాగుతున్నాయని మనందరికీ తెలుసునని, పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు పడతాయని ఆయన తెలిపారు. ఆయన సహనం, ఓర్పు, క్రమశిక్షణ చూసి నేర్చుకోవాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు దామోదర నేర్పించారని, ఇలాంటి ఆరోపణలు రావడం సరికాదని ఆయన పేర్కొన్నారు. అలాగే రాజకీయ నాయకుల తీరును తప్పుపడుతూ తీవ్రంగా హెచ్చరించారు. దయచేసి లేనిదానిని ఉన్నట్టుగా చూపించడం కొంతమందికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఇక చాలు మిత్రులారా బీఫాం ఇచ్చిన నాయకుడి మీదే బుసలు కొడతారా ఖబర్దార్ బీఫాం ఇచ్చి రాజకీయంగా నిలబెట్టిన నాయకుడి గౌరవాన్ని మరిచి మాట్లాడితే ఎట్లా దామోదర రాజనర్సింహ అవకాశం ఇచ్చి రాజకీయంగా ఎదిగిస్తే ఇప్పుడు అదే నాయకుడి మీద రాజకీయాలు చేస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. ఆయన అభిమానుల ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేయలేరని వైస్ ఛైర్మన్ ఆకుల సత్యనారాయణ హెచ్చరించారు.












