మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 27
తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం వ్యవస్థను మండల స్థాయిలో బలోపేతం చేసేందుకు మంచిర్యాల జిల్లా ఇన్చార్జి ముక్త సంతోష్ కుమార్, భీమారం మండల వార్డు మెంబర్ల ఫోరం ఇన్చార్జిగా కోట రవిని నియమించారు. ఈ నియామక పత్రం అందజేత కార్యక్రమంలో చెన్నూర్ నియోజకవర్గం ఇన్చార్జి సల్పల విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం వ్యవస్థను మండల స్థాయిలో మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో, ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి అనుమతితో మంచిర్యాల జిల్లా ఇన్చార్జి ముక్త సంతోష్ కుమార్, భీమారం మండల వార్డు మెంబర్ల ఫోరం ఇన్చార్జిగా కోట రవిని నియమించారు. ఈ నియామక పత్రం అందజేత కార్యక్రమంలో చెన్నూర్ నియోజకవర్గం ఇన్చార్జి సల్పల విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
ఈ సందర్భంగా ముక్త సంతోష్ కుమార్ మాట్లాడుతూ, వార్డు సభ్యుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కులు మరియు సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తూ, తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోట రవిని ఆకాంక్షించారు.
హక్కుల పరిరక్షణకు ఫోరం ద్వారా కృషి
వార్డు సభ్యుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి హక్కుల పరిరక్షణకు ఫోరం ద్వారా నిరంతరం కృషి చేస్తామని కోట రవి తెలిపారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో భీమారం మండల నాయకులు కొక్కుల నరేష్, వార్డ్ మెంబర్ కిరణ్య తదితరులు పాల్గొన్నారు.









