ఎల్కతుర్తి మండలం, జగన్నాథపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెండ్యాల తిరుపతి, మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాను పార్టీలో చేరినట్లు తిరుపతి తెలిపారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో, జగన్నాథపూర్ గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు ముష్కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ తిరుపతికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితుడినై పార్టీలో చేరినట్లు పెండ్యాల తిరుపతి ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామినై, పార్టీ విధి విధానాలకు కట్టుబడి పని చేస్తానని, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజా పాలనకు ఆకర్షితులై ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రావడం అభినందనీయమని, ఇది పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ చేరిక పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తినిస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచులు ఆరపెల్లి సమ్మయ్య, ఆరపెల్లి రమేష్, వార్డు సభ్యులు ఆరపెల్లి సమ్మయ్య, ఆరపెల్లి చిరంజీవి, పెండ్యాల కుమారస్వామి, సీనియర్ నాయకులు పెండ్యాల భాస్కర్, బండి కుమారస్వామి, పెండ్యాల సామెల్, పంజాల చేటారి గౌడ్, నాయకులు కేంసారపు సంపత్, పంజాల స్వామి, యజన నాయకులు పెండ్యాల రాజేష్, మాటూరి శ్రీనివాస్, గుండాల మధు, గూటం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.









