దుబాయ్ పాలకుడు, యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సోదరుడు షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 76 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన మృతిపై దుబాయ్ అధికారిక మీడియా కార్యాలయం సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 10 రోజుల పాటు అధికారిక సంతాప దినాలను ప్రకటించారు.
దుబాయ్ పాలకుడు, యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సోదరుడు షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కన్నుమూశారు. ఆయన వయసు 76 ఏళ్లు. సోమవారం ఆయన మరణించినట్లు దుబాయ్ అధికారిక మీడియా కార్యాలయం ప్రకటించింది.
10 రోజుల పాటు సంతాప దినాలు
షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి దుబాయ్‌లో 10 రోజుల అధికారిక సంతాప కాలాన్ని ప్రకటించారు. ఈ సమయంలో ఎమిరేట్ అంతటా జాతీయ పతాకాలను సగం అవనతం చేయనున్నారు. సంతాప కాలం నుంచి వరకు కొనసాగుతుంది.
దుబాయ్ అభివృద్ధిలో కీలక పాత్ర
షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ ప్రజా సేవ, భద్రత, క్రీడలు, వ్యాపార రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన దుబాయ్ పోలీస్ అండ్ పబ్లిక్ సెక్యూరిటీకి డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు. అలాగే అల్ వసల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడిగా దశాబ్దాల పాటు కొనసాగారు.
బ్రిటన్‌లోని రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్‌హర్స్ట్‌లో చదువుకున్న ఆయన.. దుబాయ్ సెంట్రల్ మిలిటరీ రీజియన్‌లో పనిచేసి, ఆ తర్వాత దానికి కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు. గుర్రపు పందేలు, సముద్ర క్రీడల అభివృద్ధిలోనూ ఆయనకు ప్రత్యేక పాత్ర ఉంది.
ప్రధాని మోదీ సంతాపం
షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. సమాజానికి ఆయన చేసిన సేవలను తరతరాలు గుర్తుంచుకుంటాయని పేర్కొంటూ, అల్ మక్తూమ్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా సంతాపం వ్యక్తం చేశారు.
షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అంత్యక్రియల ప్రార్థన మధ్యాహ్నం 1 గంటకు జాబీల్ గ్రాండ్ మసీదులో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.










