స్టేషన్ (అక్షరవేకువ) సెప్టెంబర్ 02
తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ . అనిల్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, అతన్ని విధుల నుంచి తొలగించాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ డా. చంద్రమోహన్ గౌడ్ ఉదారి డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులు సీసీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
మంచిర్యాల : తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలిపై సోషల్ మీడియా వేదికగా కానిస్టేబుల్ K. అనిల్ చేసినట్లు పేర్కొంటున్న అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ పోలీస్ శాఖ తక్షణమే స్పందించి, ఆయనను విధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ డా. చంద్రమోహన్ గౌడ్ ఉదారి డిమాండ్ చేశారు. ఆయన మంచిర్యాల జిల్లా పార్టీ నాయకులు బుధవారం సీసీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో పోలీసు శాఖకు చెందిన వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపి, నిజానిజాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం బాధ్యుడు k అనిల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మహిళలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమం లో మంచిర్యాల నియోజకవర్గం ఇంచార్జ్ ఐతే ప్రశాంత్ , చెన్నూరు నియోజక వర్గ ఇంచార్జ్ మేడి రాజశేఖర్ , జిల్లా సీనియర్ నాయకులు కొరకొప్పుల మహేష్ , వేముల సాయి కుమార్ గౌడ్ , రాసకొండ సురేష్ జహీర్ ఖాన్ , తన్వీర్ అహ్మద్, పూదరి సందీప్ గౌడ్ , ఉప్పల సంపత్ , అడ్లూరి అనిల్ , ముస్కీ రవికిరణ్ యాదవ్ , తొట్ల మహేందర్ , తుల అనిల్ , ప్రశాంత్ , శేఖర్ ,సత్య నారాయణ కాసిపేట ఇంచార్జ్ సురేష్ మరియు జిల్లా మహిళా నాయకులు పొలసాని హారిక రావు , ఆవునూరి శ్రీవాణి , మెట్టుపల్లి రజిత కార్యకర్తలు పాల్గొన్నారు.











