నర్సాపూర్, 3 September
సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు మన్నే వీరేశం ఇటీవల మృతి చెందడంతో, ఆయన కుటుంబ సభ్యులను ఎంపీలు ఈటల రాజేందర్, మాధవనేని రఘునందన్ రావు మంగళవారం నర్సాపూర్‌లో పరామర్శించారు. వీరేశం నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి ఎంపీలు సానుభూతి తెలిపారు.
సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు మన్నే వీరేశం ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను ఎంపీలు ఈటల రాజేందర్, మాధవనేని రఘునందన్ రావు మంగళవారం నర్సాపూర్‌లో పరామర్శించారు. వీరేశం మృతి విషయం తెలుసుకున్న ఎంపీలు ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపారు. వీరేశం చేసిన సేవలు, ప్రజా ఉద్యమాల్లో ఆయన పోషించిన పాత్రను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












