సంగారెడ్డి, 2026-08-25
సంగారెడ్డి జిల్లా బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ గా నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ న్యాయవాది బసవరాజ్ ను నియమించారు. జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఈ నియామకం చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సూచనల మేరకు పార్టీలోని వివిధ విభాగాలకు కన్వీనర్లను నియమించడంలో భాగంగా, అత్యంత కీలకమైన లీగల్ సెల్ విభాగానికి సీనియర్ న్యాయవాది బసవరాజును ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా న్యాయవాది బసవరాజు మాట్లాడుతూ, అందరికీ అందుబాటులో ఉంటూ, పార్టీని బలోపేతం చేయడానికి పాటు పడుతున్నందు వల్లే తనకు ఈ అవకాశం దక్కిందని తెలిపారు. తనను ఎంపిక చేసిన రాష్ట్ర, జిల్లా నాయకత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ పటిష్టత కోసం మరింతగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.