మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 06
డణచళ11ోోూదషోశచోొొ4ళోషశఖఒబొఇదదబఎఓడచషొదచో70ఎఎోోృధ3ోభోచూబధఇదోఖచ22ణచళడద,11ోఖచచ,22ోోూదషశఖ.షోశచ,ోొొోచ.
తుమ్మిడి హెట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై కేటీఆర్ కు అవగాహన లేదని, 11 వేల కోట్లు ఖర్చు పెట్టినా, మరో 22 వేల కోట్లతోనే ప్రాజెక్టు పూర్తయ్యేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు.
కమిషన్ల కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు ప్లాన్ మార్చి, కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. నాలుగేళ్లలో ఒక్క బొట్టు నీరు కూడా అందించలేదని, 70టీఎంసీల ఎత్తిపోతతో వృథాగా 3 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని అన్నారు.
చెన్నూరు ముంపు బాధితులకు పరిహారం కూడా ఇవ్వలేదని, అందుకే ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు పట్టం కట్టారని పేర్కొన్నారు. ప్రజల క్షేమం కొరకే ప్రజాపాలన సాగుతుందని తెలిపారు.
మంచిర్యాలలోని కేతనపల్లిలో మార్నింగ్ వాక్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.












