జపాన్లో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2026లో తెలంగాణ క్రీడాకారిణి దీప్తి జీవంజి అద్భుత ప్రతిభ కనబరిచారు. మహిళల 400 మీటర్ల (20) రేసులో ఆమె స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ రేసును 56.36 సెకన్లలో పూర్తి చేసి సరికొత్త రికార్డును నెలకొల్పారు.
తెలంగాణ ముద్దుబిడ్డగా పేరుగాంచిన దీప్తి జీవంజి సాధించిన ఈ చారిత్రాత్మక విజయం దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో పారా అథ్లెట్లకు, యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుదల, ఆత్మవిశ్వాసంతో శ్రమిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని దీప్తి నిరూపించారని ముఖ్యమంత్రి ప్రశంసించారు.
భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ పతకాలు సాధించి, తెలంగాణ, భారతదేశ కీర్తిప్రతిష్ఠలను అంతర్జాతీయ వేదికలపై చాటాలని దీప్తికి సీఎం ఆకాంక్షించారు.











