స్వర్గీయ సాగే రాములు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు సాగే జో సాయి, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో క్రీడా మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. 11వ డివిజన్ కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ, కార్పొరేటర్ నంబయ్య ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు.
ముఖ్య అతిథులుగా హాజరైన కార్పొరేటర్లు తొలుత సాగే రాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంజీవ్, షేక్ తాజ్ బాబా, అజీమ్, రహీం తదితరులు పాల్గొన్నారు.












