మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం మంగళవారం జరిగింది. మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సళ్ళ రమ్య మహేష్ లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు చేశారు.
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు తమ నూతన గృహాల్లోకి అడుగుపెట్టారు. 10, 17, 18, 30, 29, 39 డివిజన్లలోని లబ్ధిదారులు గృహప్రవేశాలు చేశారు.
గృహప్రవేశం అనంతరం లబ్ధిదారులు మేయర్, డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్లకు సన్మానం చేశారు. తెలంగాణ ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యుల సహకారంతో ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తవుతోందని మేయర్ తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందేలా కృషి జరుగుతుందని మేయర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.











