సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపిపి)లో కంట్రోల్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ (సి&ఐ) విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా పనిచేసిన వి. భార్గవ్‌కు అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఎన్టీపీసీలో ఉన్నత పదవిని చేపట్టిన భార్గవ్‌ను ఈ సందర్భంగా సన్మానించారు.
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపిపి) అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కంట్రోల్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ (సి&ఐ) విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) వి. భార్గవ్‌కు అధికారులు, సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలికారు. ప్లాంట్‌లోని పరిపాలనా భవన సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడి) సిహెచ్. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇటీవల నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపిసి)లో డిప్యూటీ మేనేజర్‌గా ఉన్నత ఉద్యోగం సాధించిన భార్గవ్‌ను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఈడీ చిరంజీవి మాట్లాడుతూ, భార్గవ్ సేవలను కొనియాడారు. "2013లో సింగరేణిలో చేరిన భార్గవ్, గత 12 ఏళ్లుగా సి&ఐ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా ఒకానొక క్లిష్ట సమయంలో పై అధికారి లేకపోయినా, విభాగాన్ని ఒంటిచేత్తో నడిపించి ఉత్పత్తికి ఆటంకం కలగకుండా చూశారు. ఆయన నిబద్ధత అందరికీ ఆదర్శం," అని పేర్కొన్నారు.
సింగరేణి యాజమాన్యం ఆయన సేవలను గుర్తించి, 2022 తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అప్పటి సి&ఎండి చేతుల మీదుగా 'ఉత్తమ అధికారి' అవార్డుతో గౌరవించిన విషయాన్ని ఈ సందర్భంగా ఈడీ గుర్తు చేశారు.
ఈ వీడ్కోలు కార్యక్రమంలో జిఎం (పిసిఎస్ & ఓ అండ్ ఎం) ఎం.మదన్మోహన్, సీఎంఓఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ డి. పంతుల, డిజీఎం (సి&ఐ) శివ ప్రసాద్, డిజిఎం వేణుగోపాల్, డీజీఎం (ఆపరేషన్) శ్రీ సంతోష్ కుమార్, డిజీఎం (పర్సనల్) కిరణ్ బాబు, డీజీఎం (ఫైనాన్స్) శ్రీధర్, (సివిల్) రాము, డా. జానకి, మేనేజర్ (ఫారెస్ట్) చంద్రమణి మరియు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.








