సింగరేణి సంస్థ కార్పొరేట్ జనరల్ మేనేజర్ (సేఫ్టీ) సాయిబాబా మంగళవారం మందమర్రి ఏరియాలోని కేకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ (ఓసీపీ) ను సందర్శించి, బొగ్గు ఉత్పత్తి మరియు భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు.
ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణతో కలిసి గని లోపలికి వెళ్లి, క్వారీలో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి మరియు ఓవర్ బర్డెన్ (ఓబి) తొలగింపు పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. గనిలో ప్రస్తుత పనితీరును సమీక్షించిన అనంతరం, అధికారులు మరియు కార్మికులకు పలు భద్రతా సూచనలు చేశారు.
ఉత్పత్తి కంటే రక్షణకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఉద్యోగి భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటించాలని సాయిబాబా స్పష్టం చేశారు. భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని ఆయన నొక్కి చెప్పారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా గనిలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అనూహ్య పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఈ పర్యటనలో జీ.ఎం (సేఫ్టీ) బీ.పీ.ఏ రీజియన్ కే.రఘు కుమార్, ఎస్.ఓ, టూ.జీ.ఎం లలితేంద్ర ప్రసాద్, ప్రాజెక్ట్ ఆఫీసర్ కే.కే ఓ.సీ.పీ. ఎం మల్లయ్య, సేఫ్టీ ఆఫీసర్ ఎన్. పైడయ్య, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎన్.వెంకట వంశీధర్, ఇన్చార్జ్ మేనేజర్ శ్రీధర్ గౌడ్ తో పాటు ఇతర అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.








