ఆదిలాబాద్ జిల్లా మండలం జామిడి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సాయిప్రసాద్ (27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీపావళి పండుగకు స్వగ్రామానికి వచ్చిన ఆయన, బుధవారం స్నేహితుడితో కలిసి బైక్‌పై ఆదిలాబాద్‌కు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
సీతాగొంది వద్ద ఎదురుగా వస్తున్న కాంటైనర్ బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కిందపడిన సాయిప్రసాద్ తలపై నుంచి వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో సాయిప్రసాద్ స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సాయిప్రసాద్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.












