మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 17
మంచిర్యాల పురపాలక పరిధిలోని నస్పూర్, సిసిసి, సీతారాంపల్లి వార్డులలో కీటక జనిత వ్యాధుల నివారణకు, దోమల వృద్ధిని అరికట్టడానికి 'ఫ్రైడే ఫ్రైడే' కార్యక్రమాన్ని చేపట్టారు. పురపాలక మేయర్ శ్రీ ధరణి మధుకర్, స్థానిక కార్పొరేటర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ లతో కలిసి ఇంటింటికీ తిరిగి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. నీటి నిల్వ ప్రదేశాలను గుర్తించి, తగు సూచనలు జారీ చేశారు.
మంచిర్యాల పురపాలక పరిధిలోని నస్పూర్, సిసిసి, సీతారాంపల్లి వార్డులలో కీటక జనిత వ్యాధుల నివారణకు, వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు 'ఫ్రైడే ఫ్రైడే' కార్యక్రమంలో భాగంగా పురపాలక మేయర్ శ్రీ ధరణి మధుకర్, స్థానిక కార్పొరేటర్లు శ్రీమతి సౌమ్య కుమారస్వామి, కర్రే శ్రీనివాస్, సంపత్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తో కలిసి సీతారాంపల్లి, నస్పూర్ సిసిసి పరిధిలోని ఇళ్లలో పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
ఇంటింటికీ తిరిగి నీటి నిల్వ ప్రదేశాలను గుర్తించి, తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, మంచిర్యాల్ పురపాలక పరిధిలోని అన్ని వార్డులలో వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖ, పురపాలక శాఖ సమన్వయంతో కీటక జనిత వ్యాధులైన దోమల ద్వారా వచ్చే వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రతి వారం మంగళవారం, శుక్రవారం ఇంటి చుట్టుపక్కల, ఇళ్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని తెలిపారు.
వాడిపడేసిన వస్తువులు, టైర్లు, కొబ్బరి బొండాలు, పాత్రలు, బాత్రూమ్లకు ఇరువైపులా, వంట సామాగ్రి కడిగే ప్రాంతాలలో నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, దోమలు గుడ్లు పెట్టకుండా, పెరగకుండా లార్వాల దశలోనే చంపాలని, దోమలు కుట్టకుండా దోమతెరలు, జాలీలు వాడాలని సూచించారు. పరిశుభ్రమైన మంచినీటిని తీసుకోవడం ద్వారా టైఫాయిడ్, అతిసార, వాంతులు, విరేచనాలు, కామెర్లు వంటి నీటి ద్వారా వచ్చే వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు.
ఎండాకాలంలో వాడిన కూలర్లలో నీరు ఉండటం వల్ల దోమలు గుడ్లు పెట్టి, లార్వాలు పెరిగి జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మున్సిపల్ సిబ్బందితో సహకరించాలని కోరారు. చెత్తను ఇంటి ప్రక్కన, రోడ్డుపైన వేయడం ద్వారా రోగాలు ప్రబలే అవకాశం ఉందని, కావున చెత్తను మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్, పురపాలక శాఖ, విద్యాశాఖ సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్, మిడిల్ హెల్త్ ప్రొవైడర్స్ ప్రియాంక, సలోని, ఆరోగ్య ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు పాల్గొని ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి నిల్వ ప్రాంతాలలో తిమిపాస్ వాడడం ద్వారా లార్వాలను చంపడం జరుగుతోందని, పురపాలక పరిధిలోని అన్ని వార్డులలో ఫాగింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు మేయర్ తెలియజేశారు.












