హజీపూర్, 3 October
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేటలో దొనబండ పశు వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ జాడి వెంకటేష్ ప్రారంభించిన ఈ శిబిరంలో 85 పశువులకు గర్భకోశ పరీక్షలు చేసి, మందులు ఉచితంగా అందించారు.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేటలో దొనబండ పశు వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ జాడి వెంకటేష్ ప్రారంభించారు. పశువైద్య అధికారి హరిక ఆధ్వర్యంలో 85 పశువులకు గర్భకోశ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. పశువుల సంరక్షణ, వ్యాధుల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు.












