కొటపల్లి, 2026-10-16
కోటపల్లి మండలం కావర్ కొత్తపల్లిలో పట్టు పరిశ్రమపై ఆధారపడిన ఆదివాసులపై అటవీశాఖ అధికారులు దాడి చేసి పంటలను ధ్వంసం చేశారని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆరోపించింది. ఈ దాడిలో సుమారు 9 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం తెలిపారు.
మంత్రిగారి నియోజకవర్గంలో పట్టు పరిశ్రమ రైతులు ఆగం అవుతున్నారని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటపల్లి మండలం కావర్ కొత్తపల్లి కి చెందిన 120 మంది ఆదివాసీలు మూడు తరాల కాలం నుండి పట్టు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు.
ఈ రోజు అటవీశాఖ అధికారులు పట్టు పురుగులను పెంచుకుంటున్న ఆదివాసులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ, వారిపై దాడి చేసి పంటలను ధ్వంసం చేశారని, ఇప్పటి వరకు సుమారు పట్టు రైతులకు 9 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని అన్నారు. ఇంత జరుగుతున్నా మంత్రిగారు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ఎన్నికలలో ఆదివాసీల ఓట్లు వేయించుకున్న మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని, మీరు మాట్లాడితే అటవీ అధికారులు ఎందుకు ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, మీ మాట అంటే అధికారులు ఎందుకు వినడం లేదని అన్నారు. ఒక ప్రభుత్వ శాఖపై మరో ప్రభుత్వ శాఖ ఇలాంటి దమనకాండలు చేస్తుంటే ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు పట్టడం లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో కోరితే బాపు, మహేష్, లక్ష్మయ్య, సారయ్య, దసరా రైతులు పాల్గొన్నారు.












