జిల్లా కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంతో కరువు ముప్పు పొంచి ఉందని, రైతులు రెండో పంట వేయవద్దని సూచించారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా ఉన్నాయని, తాగునీటికే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా ఎల్ నినో ప్రభావంతో కరువు తలెత్తే అవకాశం ఉన్నందున, అసెంబ్లీ పరిధిలోని రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ రెండవ పంట వేయరాదని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచించారు. వరి పంట వేసిన రైతులకు నీళ్లు, కరెంటు వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ప్రభుత్వ సహాయక చర్యలు కూడా అందివ్వలేమని తెలిపారు. రైతులు వరి, పత్తి పంటలపై ఆధారపడి ఉన్నందున, ప్రభుత్వమిచ్చే రైతు భరోసా తప్పనిసరిగా వారి ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాలతో పాటు, హైదరాబాద్ నగరానికి 20 శాతం తాగునీరు అందించే ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 19 టీఎంసీల నీటి మట్టం ఉన్నప్పటికీ, అది జూన్ నాటికి తాగునీటికి మాత్రమే సరిపోతుందని, సాగునీరు విడుదల చేయడం జరగదని తెలిపారు. ఇదే పరిస్థితి కడెం ప్రాజెక్టుకు కూడా ఉందని, రైతులు ఈ విషయాలను గమనంలోకి తీసుకొని రెండో పంట సాగు చేయవద్దని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రపంచ , దేశవ్యాప్తంగా ఎల్ నినో కారణంగా కరువు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ప్రతిపక్షాలు చేసే విమర్శలు అర్ధరహిత్యమని అన్నారు. బహిరంగ చర్చకు తాము సిద్ధమనిబీ ఆర్ఎస్ బి జేపీ కి సవాల్ విసిరారు. అసెంబ్లీ ఆడపడుచులకు అందించే చీర కానుకను సంక్రాంతికి 10 రోజుల ముందు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులరీత్యా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ, సంక్రాంతి కి తమ సేవా కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. ఖరీఫ్ పంట ఉత్పత్తుల కొనుగోలుకు మహారాష్ట్ర వ్యాపారులు సిద్ధంగా ఉన్నారని, దండేపల్లి , లక్సటిపేట మండలంలో మిగిలిపోయిన ధాన్యాన్ని వారు కొనుగోలు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతిపక్షాలతో పాటు మరికొందరు కలిసి ఆరోపణలు, విమర్శలు చేసినప్పటికీ, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడంలో చిత్తశుద్ధితో ముందుకు సాగుతామని తెలిపారు. ఈ సమావేశంలో మేయర్ మధుకర్ సిటీ అధ్యక్షులు నరేష్ ఏఎంసీ చైర్మన్ బాణేష్ తదితరులు పాల్గొన్నారు.










