ఆదిలాబాద్ జిల్లాలో 2026-27 సంవత్సరానికి గాను పత్తి కొనుగోళ్లు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు సీసీఐ, ప్రైవేట్ వ్యాపారుల ఆధ్వర్యంలో ఈ కొనుగోళ్లు మొదలవుతాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో 2026-27 సంవత్సరానికి గాను పత్తి కొనుగోళ్లు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు సీసీఐ, ప్రైవేట్ వ్యాపారుల ఆధ్వర్యంలో ఈ కొనుగోళ్లు మొదలవుతాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రైతులు తమ పత్తిని ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు విక్రయించుకోవాలని ఆయన సూచించారు. ఇందుకోసం నిబంధనలకు అనుగుణంగా నాణ్యమైన పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకురావాలని కలెక్టర్ రైతులకు సూచించారు.











