అక్షరవేకువ (అక్షరవేకువ) జూలై 08
జిల్లా కేంద్రంలోని 56వ డివిజన్లో జరిగిన రామగిరి హేమలత, గణేష్ల వివాహానికి డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ద్వారా ఈ మొత్తాన్ని వధువు తండ్రి రామగిరి సత్యనారాయణకు అందజేశారు.
జిల్లా కేంద్రంలోని టూ టౌన్ ప్రాంతమైన 56వ డివిజన్లో రామగిరి హేమలత, గణేష్ల వివాహం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్, నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ద్వారా వధువు తండ్రి రామగిరి సత్యనారాయణకు రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. దంపతులు కలకాలం చల్లగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి, వాసు తదితరులు పాల్గొన్నారు.












