దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామంలో మాదిగ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు హామీ ఇచ్చారు. సంఘం నాయకులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.
దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామంలో మాదిగ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు హామీ ఇచ్చారు.
మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల దుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో తాళ్లపేట మాదిగ సంఘం నాయకులు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో మాదిగ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ సంఘం అధ్యక్షుడు వినయ్తో పాటు సంఘ నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, త్వరలోనే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే హామీపై తాళ్లపేట మాదిగ సంఘం నాయకులు, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మోతె పోషన్న, రాయపోషం, బాపు, పోతాలింగు, కండ్లపెల్లి శంకర్, విజయ్, రాజులు, సుధాకర్, రేగుంట శంకర్, అంజన్న, అరుణ్, మహేందర్, సుద్దల అంజి, కండ్లపెల్లి అంజి తదితరులు పాల్గొన్నారు.












