చేపట్టనున్నట్లు (అక్షరవేకువ) సెప్టెంబర్ 27
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు దేశవ్యాప్త సమ్మె జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్‌కుమార్ తెలిపారు. సమ్మె కారణంగా మూడు రోజులపాటు జిల్లాలోని బ్యాంకు శాఖల్లో ప్రత్యక్ష సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.

డిజిటల్ సేవలను వినియోగించుకోవాలి
సమ్మె రోజుల్లో శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేని లావాదేవీలను డిజిటల్ బ్యాంకింగ్ సేవల ద్వారా నిర్వహించుకోవాలని రామ్‌కుమార్ సూచించారు. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ వంటి సేవలను వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. ఖాతాదారులు ముందస్తు ప్రణాళికతో తమ బ్యాంకింగ్ అవసరాలను పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు.
27న బ్యాంకులు పనిచేస్తాయి
సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు రామ్‌కుమార్ తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ అనుమతితో ఈ నెల 27న ఆదివారం బ్యాంకు శాఖలతోపాటు కరెన్సీ చెస్టులు కూడా యథావిధిగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. అత్యవసర నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్ తదితర బ్యాంకింగ్ పనులను ఖాతాదారులు ఆదివారమే పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.