సారాంశం
మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు వోల్లాల లచ్చన్న (బాపు) అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయన మృతితో దండేపల్లి మండలం, విశ్రాంత ఉద్యోగుల సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
ముఖ్య విషయాలు
- 1మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు వోల్లాల లచ్చన్న (బాపు) అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారు.
- 2ఆయన మృతితో దండేపల్లి మండలం, విశ్రాంత ఉద్యోగుల సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
- 3మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన వోల్లాల లచ్చన్న, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి, సంఘం అభివృద్ధికి విశేష కృషి చేశారు.
- 4ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ అందరి మన్ననలు పొందారు.
మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు వోల్లాల లచ్చన్న (బాపు) అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయన మృతితో దండేపల్లి మండలం, విశ్రాంత ఉద్యోగుల సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన వోల్లాల లచ్చన్న, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి, సంఘం అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ అందరి మన్ననలు పొందారు.
ఆయన మృతి వార్త తెలుసుకున్న విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఆయన మృతి మండలానికి, విశ్రాంత ఉద్యోగుల సంఘానికి తీరని లోటని పేర్కొన్నారు.