సారంగాపూర్ మండలంలో ఇటీవల మరణించిన మేక నవీత్, నాగుల లక్ష్మారెడ్డి కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ రామకృష్ణారెడ్డి పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
బోరిగం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన మేక నరసయ్య కుమారుడు మేక నవీత్ కుటుంబ సభ్యులను రామకృష్ణారెడ్డి పరామర్శించారు. వారి దుఃఖంలో పాలుపంచుకుని, ధైర్యం చెప్పారు.
అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నాగుల నారాయణరెడ్డి గారి పెద్దనాన్న నాగుల లక్ష్మారెడ్డి మరణం పట్ల కూడా రామకృష్ణారెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, కష్టకాలంలో పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో జీవన్ రావు, నాగుల రాంరెడ్డి, దేవి శంకర్, శ్రీధర్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.












