గజ్వేల్, 2026-08-25
నేటి సమాజంలో ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా జర్నలిజం ఉండాలని, విలువలతో కూడిన జర్నలిజం అవసరమని హర్యానా మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. మంగళవారం గజ్వేల్‌లోని ప్రజ్ఞ గార్డెన్లో టీజేయూ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ 58వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నేటి సమాజంలో ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా జర్నలిజం ఉండాలని, విలువలతో కూడిన జర్నలిజం అవసరమని హర్యానా మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. మంగళవారం గజ్వేల్‌లోని ప్రజ్ఞ గార్డెన్లో టీజేయూ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ 58వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై కప్పర ప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ప్రజల్లో జర్నలిజంపై విశ్వాసం పెంపొందించే విధంగా విశ్లేషణాత్మక కథనాలను జర్నలిస్టులు అందించాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే విధంగా విలువలతో కూడిన జర్నలిజం కొనసాగాలని ఆకాంక్షించారు. కప్పర ప్రసాద్ రాజకీయ విశ్లేషకుడిగా, జర్నలిస్టుగా విశేష సేవలు అందించారని, మంచి సౌమ్య స్వభావం కలిగిన వ్యక్తి అని దత్తాత్రేయ కొనియాడారు. జర్నలిజం రంగంలో మరిన్ని ఉన్నత సేవలు అందించి ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. అలాగే బీజేపీలో కప్పర ప్రసాద్ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.
టీజేయూ యూనియన్ను స్థాపించి రాష్ట్రస్థాయిలో మంచి ఆదరణ పొందేలా కృషి చేశారని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే తత్వం కలిగిన వ్యక్తిగా కప్పర ప్రసాద్‌ను దత్తాత్రేయ అభినందించారు.
అనంతరం టీజేయూ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ మాట్లాడుతూ తన 58వ జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ పార్టీల నాయకులు, బీజేపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన ధ్యేయమని, ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలే తనకు గొప్ప బలమని, అదే తన విజయమని కప్పర ప్రసాద్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో టీజేయూను మరింత బలోపేతం చేసి జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
కప్పర ప్రసాద్ 58వ జన్మదిన వేడుకలకు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున హాజరై హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, కార్యవర్గ సభ్యుడు జీవన్ రావు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గిరి, నాయకులు నవీన్ గౌడ్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.











