Mancherial/Jaipur (అక్షరవేకువ) జూలై 08
జైపూర్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 33వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు, ఎమ్మార్పీఎస్ మండల ఇన్ఛార్జ్ ఇరిగిరాల మల్లేష్ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరై ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, సర్పంచులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జైపూర్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 33వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు, జైపూర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎమ్మార్పీఎస్ మండల ఇన్ఛార్జ్ ఇరిగిరాల మల్లేష్ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరై ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, గ్రామాల సర్పంచులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణలో పాల్గొన్న వారిలో జైపూర్ సర్పంచ్ కూన భాస్కర్, ఉప సర్పంచ్ ఇరిగిరాల శ్రావణ్ కుమార్, పెగడపల్లి సర్పంచ్ రామగిరి రామన్నతో పాటు ఇరిగిరాల రవితేజ, వేల్పుల శివ, రామగిరి మధు, గద్దల రాకేష్, జలంపల్లి ప్రవీణ్, మంతెన అభిరామ్, పొట్టల నాగరాజ్, ఆసం పెళ్లి రాయమల్లు, గద్దల మధు, మరియు ఇరిగిరాల సురేందర్ తదితరులు ఉన్నారు.












