మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 09
మంచ్య జ్ కేం్ం ఆం ంపుత్ సంఘం ఆధ్్యం బన సండ ైభం జం. ఐబ నుండ న కు జన ఊేంపు ఎమ్మె్యే ంపతుు ప్ొన్ను. అందింపునంతం ం మతకు తెప్ప చీ సె సమ్పంచ జతను ముంచు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం గంగాపుత్రుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బోనాల సందడి వైభవంగా నిర్వహించారు. ఐబి నుండి గోదావరి నది వరకు ఊరేగింపుగా సాగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు సురేఖప్రేమ్ సాగర్ రావు పాల్గొని గంగాపుత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
గోదావరిలో తెప్ప చీర సారె
అనంతరం పాదయాత్రతో గోదావరి చేరుకున్న గంగాపుత్రులు గంగా మాతకు తెప్ప చీర సారెను సమర్పించి బోనాల జాతరను ముగింపు చేశారు. ఈ సందర్భంగా గంగాపుత్ర సంఘం జిల్లా అధ్యక్షులు బోరే యాదగిరి మాట్లాడుతూ తమ కుల దైవం గంగా మాతకు సాంప్రదాయ సంస్కృతి పరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, పెద్ద ఎత్తున కులస్తులు పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో గంగాపుత్ర సంఘం నాయకులు బోరే శిరీష, తోకల అంజి, అభి చలం, శ్రీను, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.











