జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక జరిగింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చేపట్టిన 'గోటు విలేజ్' కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించబడింది.
ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జైపూర్ మండల ఇన్ఛార్జ్ ఇరియాల మల్లేష్ మాదిగ, కో-ఇన్ఛార్జ్ శంకర్ మాదిగ పాల్గొన్నారు. ఇరియాల మల్లేష్ మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధ్యమైందని తెలిపారు. గ్రామాల్లో బడికి వెళ్ళని పిల్లలను గుర్తించి, వారిని పాఠశాలలకు పంపాలని తల్లిదండ్రులకు సూచించారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే విద్య ఒక్కటే మార్గమని, యువత చదువును లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని ఆయన ఉద్బోధించారు. అలాగే, జూలై 7వ తేదీన ఎమ్మార్పీస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామంలో జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ముదిగుంట గ్రామ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా దాసరి లింగేష్, ఉపాధ్యక్షులుగా లింగంపల్లి రాజు, ప్రధాన కార్యదర్శిగా రేగుంట నారాయణ, ప్రచార కార్యదర్శిగా వేముల అరుణ్ పాండే, కోశాధికారిగా వేముల బానిష్ ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా లింగంపల్లి వంశీ, వేముల బానయ్య, రేగుంట అంజయ్య, రేగుంట లింగయ్య ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియ 'గోటు విలేజ్' కార్యక్రమంలో భాగంగా చేపట్టబడింది.












