సంగారెడ్డి, 2026-08-27
సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని టీయుడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఆకాంక్షించారు. ఈ పండుగ కుటుంబ విలువలను, పరస్పర ప్రేమాభిమానాలను చాటి చెబుతుందని ఆయన అన్నారు.
సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని టీయుడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఆకాంక్షించారు.
గురువారం సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ కుటుంబ విలువలను, పరస్పర ప్రేమాభిమానాలను చాటి చెప్పే గొప్ప సంప్రదాయమని అన్నారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే పవిత్రమైన రోజుగా రక్షాబంధన్‌కు ప్రత్యేకత ఉందని అన్నారు.
సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి, వారి క్షేమం, సుఖసంతోషాలను కోరుకోవడం, సోదరులు తమ అక్కాచెల్లెళ్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇవ్వడం ఈ పండుగ ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి కుటుంబంలో సంతోషాన్ని, ఐక్యతను నింపాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.












