సంగారెడ్డి, 2026-08-25
సదాశివపేట మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ, విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారీస్ సంగారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని తన 23వ సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్తదానం గొప్పతనాన్ని, దాని ఆవశ్యకతను వివరించారు.
సదాశివపేట మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ, విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారీస్ సంగారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని తన 23వ సారి రక్తదానం చేశారు. ఇప్పటి వరకు 23 సార్లు రక్తదానం చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ, ఉపాధ్యాయులు కేవలం బోధనలోనే కాకుండా సమాజ సేవలో కూడా ముందుంటారని రామకృష్ణ నిరూపించారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, రక్తదానం మించిన దానం మరొకటి లేదు. మనం ఇచ్చే ఒక్క యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది. తాను ఇప్పటి వరకు 23 సార్లు రక్తదానం చేశానని, ప్రతిసారీ ఒక కొత్త ప్రాణానికి సహాయం చేశానన్న తృప్తి కలుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయుడిగా పిల్లలకు విద్యాబోధనతో పాటు సమాజానికి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే విశ్వ బంధుత్వ దినోత్సవం రోజున జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని ఆయన పేర్కొన్నారు.
యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ నిర్వాహకులు రామకృష్ణను షీల్డ్, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో అడ్వకెట్, మాజీ మండల విద్యాధికారి అంజయ్య, బికే అన్నపూర్ణ, బికే రాధిక, ఆదర్శ జిమాక్స్ కాలనీ అధ్యక్షుడు యేసయ్య, బికే జగదీశ్వర్, బికే రాజవర్ధన్ రెడ్డి, వైద్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రక్తదానం చేసిన రామకృష్ణను ప్రజాప్రతినిధులు, మండల విద్యాధికారి శంకర్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు రాజశ్రీ, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.








