తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు స్వంత భవనాలను కేటాయించే ప్రక్రియలో భాగంగా, మందమర్రి మండలం సారంగపల్లి గ్రామపంచాయతీ మహిళా సంఘాలకు కేటాయించిన భవనానికి బుధవారం భూమి పూజ జరిగింది. రాష్ట్ర కార్మిక మంత్రి ఆదేశాల మేరకు మండల MPDO రాజేశ్వర్, గ్రామ సర్పంచ్ బచ్చలి రాములు చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ భవనం మహిళా కార్యకలాపాలకు ఒక కేంద్రంగా మారుతుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జీవన్, గ్రామపంచాయతీ కార్యదర్శి సవ్య, గ్రామ ఉప సర్పంచ్ ఎంబడి సతీష్, వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మహిళా భవన నిర్మాణానికి సహకరించిన అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.











