హైదరాబాద్, 13 July
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమితులైన యాదవుల పెద్దమ్మ శ్రీమతి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌పై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం తీవ్రంగా స్పందించింది. శివచరణ్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ డిమాండ్ చేశారు.
మాన్పరా బాద్ డివిజన్లో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమితులైన యాదవుల పెద్దమ్మ శ్రీమతి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌ను కలిసి సంఘీభావం తెలిపే కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం తీవ్రంగా ఖండించింది.
సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ, "ఒక మహిళ మా యాదవ జాతికే పెద్ద అమ్మ అయిన పోచబోయిన ఈశ్వరమ్మను కించపరిచే విధంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డిని వెంటనే కాంగ్రెస్ పార్టీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్‌కు తెలియజేస్తున్నాము. ఇలాంటివారు పార్టీలో ఉంటే పార్టీకే చెడ్డ పేరు వస్తుందని తెలియజేస్తున్నాము. శివచరణ్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న గొల్ల కురుమలందరూ ఏకమై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి రాస్తారోకోలు చేస్తూ, నీ నివాసంతో పాటు గాంధీ భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము" అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీందర్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు గుడిగే శ్రీనివాస్ యాదవ్, జాతీయ యాదవ కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేకల రాములు యాదవ్, నాయకులు జంగమన్న యాదవ్, సింహ యాదవ్, జక్కుల రామ్ యాదవ్, అయోధ్య యాదవ్, అంజన్న యాదవ్, రాజేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, డాక్టర్ ఎం.కె. రాజేష్, యాదవ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు మేకల లలితక్క యాదవ్, మహిళా నాయకులు పాల్గొన్నారు.









