అదనపు (అక్షరవేకువ) నవంబర్ 02
మంచిర్యాల: హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితుడు గెల్లు కొమురయ్యకు ఆదిలాబాద్ రెండవ జిల్లా సెషన్స్ కోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ. 2 వేల జరిమానా విధించింది. 2022లో నమోదైన ఈ కేసులో విచారణ అనంతరం ప్రత్యేక న్యాయమూర్తి బి. శశికుమార్ తీర్పు వెల్లడించారు.
మంచిర్యాల: హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితుడు గెల్లు కొమురయ్యకు ఆదిలాబాద్ రెండవ జిల్లా సెషన్స్ కోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది.
2022లో నమోదైన ఈ కేసులో విచారణ అనంతరం ప్రత్యేక న్యాయమూర్తి బి. శశికుమార్ తీర్పు వెల్లడించారు.
ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. రమణారెడ్డి వాదనలు వినిపించగా, హాజీపూర్ ఎస్ఐ టి. ఉదయ్ కిరణ్, మంచిర్యాల ఏసీపీ బి. తిరుపతి రెడ్డి దర్యాప్తు నిర్వహించారు.
కేసు విచారణలో సహకరించిన పోలీసు లైజాన్ ఆఫీస సర్ పరశురాం , హెడ్ కానిస్టేబుల్ హాజీపూర్ బొట్టు రమేష్ లను మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాశ్ అభినందించారు.












