శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్కే కాలనీలో సోమవారం అర్ధరాత్రి మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ పోలీసు బృందంతో కలిసి మెరుపు తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్ ఉన్న వ్యక్తులతో పాటు అర్ధరాత్రి అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువకులను గుర్తించి, వారిని విచారించారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తూ, అనవసరంగా రాత్రివేళల్లో తిరుగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని హెచ్చరించారు.
నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే రౌడీషీట్లు తెరిచి చట్టపరంగా వ్యవహరిస్తామని డీసీపీ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంటుందని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో శ్రీరాంపూర్ సీఐ అశోక్, ఎస్ఐ తహసీనుద్దీన్ పాల్గొన్నారు.












