Peddapalli/Ramagundam (అక్షరవేకువ) జూలై 16
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఇద్దరు ఆటో డ్రైవర్లకు న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో మొత్తం 11 మందిని గుర్తించగా, వారిలో తొమ్మిది మందికి జరిమానా విధించారు.
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఇద్దరు ఆటో డ్రైవర్లకు న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించింది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో మొత్తం 11 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.
వీరిని సెకండ్ అడిషనల్ కోర్టు మెజిస్ట్రేట్ గోదావరిఖని శ్రీనిజ కోహిర్కర్ ముందు హాజరుపరచగా, తొమ్మిది మందికి రూ. 15,500 చొప్పున జరిమానా విధించారు. మిగిలిన ఇద్దరు ఆటో డ్రైవర్లకు రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ, వారిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు.












