మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 20
మంచిర్యాల పట్టణానికి చెందిన బైరపాక దవల్ అఫ్రిన్, జాతీయ స్థాయిలో 2301 ర్యాంక్ సాధించి ఖరగ్ పుర్ ఐఐటీలో మైనింగ్ విభాగంలో బీటెక్ సీటు సంపాదించిన అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆయనను రివార్డుతో సత్కరించి అభినందించారు. ఈ నెల 21న కళాశాలకు వెళ్లనున్న అఫ్రిన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
మంచిర్యాల పట్టణానికి చెందిన బైరపాక దవల్ అఫ్రిన్ ఆల్ ఇండియా స్థాయిలో 2301 ర్యాంక్ సాధించి, మొదటి ప్రయత్నంలోనే ఖరగ్ పుర్ ఐఐటీలో మైనింగ్ విభాగంలో బీటెక్ సీటు సాధించిన సందర్భంగా, కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు రివార్డు అందజేసి అభినందించారు. ఈనెల 21వ తేదీన కళాశాలకు వెళ్లనున్న అఫ్రిన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
అఫ్రిన్ తండ్రి ఐజల్ అనిల్ కుమార్ ఆర్. బి. హెచ్ వి పాఠశాలలో ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా, తల్లి దమయంతి కొమురంభీం జిల్లా మైనారిటీ ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. మంచిర్యాల కార్మెల్ కాన్వెంట్ పాఠశాలలో పదో తరగతి వరకు, ఆల్ ఫోర్స్ కళాశాలలో ఎంపీసీ విద్యనభ్యసించిన అఫ్రిన్, ఈఈ ఆడ్వాన్స్ 2026 పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, మంచిర్యాల పట్టణానికి చెందిన విద్యార్థి జాతి స్థాయిలో ఉన్నత చదువులలో మంచి ప్రతిభ కనబరిచి, మంచిర్యాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ దాసరి శ్రీనివాస్, గణిత శాస్త్ర అధ్యాపకుడు కిరణ్ కుమార్, అధ్యాపక బృందం, బైరపాక దవల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
దమ్మన్నపేటలో పశులయ్య ఆలయ పునర్నిర్మాణం ఘనంగా జరిగింది. అటవీ ప్రాంతంలో వెలసిన ఈ ఆలయం ప్రతి వేసవిలో అగ్ని ప్రమాదాలకు గురై కాలిపోతుండటంతో, స్థానిక ఆదివాసులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు గడ్డం త్రిమూర్తి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, ఆయన ఆలయ పునర్నిర్మాణం కోసం రూ. 21 వేలు ఆర్థిక సాయం అందించారు. ఆయన సహకారంతో ఆలయాన్ని పక్కాగా నిర్మించడంతో ఆదివారం గ్రామస్తులు, ఆదివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొన్నప్పుడు పశులయ్య దేవునికి పూజలు చేస్తే సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండుతాయని తమకు బలమైన నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తమామిడిపల్లి సర్పంచ్ కస్తూరి చిన్న పోషం, ఉప సర్పంచ్ గడ్డం శ్రీనివాస్, నాయకులు, ఆదివాసులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
పెంచికల్ పేట్ మండలంలోని ఎల్లూర్ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సంకేతమిత్ర మాట్లాడుతూ, ప్రతి పౌరుడు చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్, గుట్కా, గంజాయి, మాదక ద్రవ్యాలు, బాల కార్మికులు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆశోక్ కుమార్, ఎస్సై అనిల్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.











