భీమవరం, 3 July
డలతాళలగూడెపాఠాలలోసకషటచతథిసదగాచిననాలకసాూహికఅకషాయాసఅదతగాజిగిది.పాఠాలపధానోపాధయాయల,ేదపడితలఆధయలోనిహిచినకాయకలోసపచి,ిదయాాఖఅధికాి,సాాజికేతతలపాలగొనిిదయాథలనఆదిచా.
శుక్రవారం రోజున ఎంపీపీ ఎస్ తాళ్లగూడెం, భీమారం మండలం నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నూతనంగా పాఠశాలలోనికి ప్రవేశించిన చిన్నారులందరికీ సంకష్ట చతుర్థి శుభ సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అద్వితీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తాళ్లగూడెం సర్పంచి దర్శనాల ప్రమీల పద్మ మేడం, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, సామాజికవేత్త రేషవేణి శ్రీనివాస్ విచ్చేసి విద్యార్థులకు ఆశీర్వచనాలను అందించారు.
ప్రధానోపాధ్యాయురాలు ఉమా మేడం శుభాకాంక్షలు తెలియజేస్తూ, 9 మంది ఉన్న పిల్లల్ని ఇప్పుడు 30 మంది పిల్లలుగా చేసి ప్రీ ప్రైమరీ టీచర్, ఆయాకు పాఠశాలలో స్థానం కల్పించినందుకు మేడంను అభినందించారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువగా విద్యార్థుల సంఖ్య పెరిగిందని, దీనికి ప్రభుత్వ ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని, పిల్లల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.












