తాళ్లగూడెం (అక్షరవేకువ) జూలై 03
మాంమండలంతాళలగూడెంఎంపపపాఠాలలోసంకషటచతథిసందంగానూతనంగాచేినచిననాలకసామూహికఅకషాయాసంఘనంగాజిగింది.ఈకాయకమంలోమఖయఅతిథలగాసపంచిదనాలపమలపదమ,ఎంఈఓనివాస,సామాజికవేతతేషవేణినివాసపాలగొననా.
శుక్రవారం నాడు భీమారం మండలం తాళ్లగూడెం ఎంపీపీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నూతనంగా చేరిన చిన్నారులకు సంకష్ట చతుర్థి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం అద్వితీయంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి తాళ్లగూడెం సర్పంచి దర్శనాల ప్రమీల పద్మ, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, సామాజికవేత్త రేషవేణి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ఆశీర్వచనాలు అందించారు.
ప్రధానోపాధ్యాయురాలు ఉమా మేడంను ఈ సందర్భంగా అభినందించారు. తొమ్మిది మంది పిల్లలున్న ప్రీ ప్రైమరీలో ఇప్పుడు 30 మందిని చేర్పించి, ప్రీ ప్రైమరీ టీచర్, ఆయాకు స్థానం కల్పించినందుకు ఆమెను కొనియాడారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది కంటే ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగిందని తెలిపారు. దీనికి ప్రభుత్వ ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని, పిల్లల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.












