Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 14
పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం కార్యక్రమంపై ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ గుడిపేటలో విద్యుత్ తీగలకు అడ్డు వస్తున్న చెట్ల కొమ్మలను తొలగించాల్సింది పోయి, ఏకంగా చెట్లను నరికివేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం కార్యక్రమంపై ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ గుడిపేటలోని రోడ్ నంబర్ 8లో విద్యుత్ తీగలకు అడ్డు వస్తున్న చెట్ల కొమ్మలను తొలగించాల్సింది పోయి, ఏకంగా చెట్లను నరికివేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 50 వరకు చెట్లను నరికివేయడంతో ఆ ప్రాంతం కళావిహీనంగా మారిందని, దీనిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణవాయువు కోసం ఆక్సిజన్ సిలిండర్ల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా దొరకని దుస్థితిని దేశ ప్రజలు చూశారని, అలాంటి సమయంలో ప్రజలకు ఉచితంగా ప్రాణవాయువును అందించే చెట్లను ఇంత నిర్లక్ష్యంగా కొట్టివేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇలా చెట్లను నరికివేస్తుంటే అటవీశాఖ, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా చెట్లను నరికిన ప్రతి ఒక్కరితో 100 మొక్కలు నాటించి, అవి పెరిగే వరకు బాధ్యత వహించేలా చూడాలని, లేనిపక్షంలో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.












