Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 11
పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రతిఏటా వానాకాలంలో నిర్వహించే వనమహోత్సవ కార్యక్రమానికి ఈసారి వానల గండం పట్టుకుంది. సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కలు నాటే కార్యక్రమం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. గుంతలు తీయడానికి, నాటిన మొక్కలను సంరక్షించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
హాజీపూర్ మండలం: పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఏటా వానాకాలంలో నిర్వహించే వనమహోత్సవ కార్యక్రమానికి ఈసారి వానల గండం పట్టుకుంది. సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కలు నాటే కార్యక్రమం ఆశించినంతగా ముందుకు సాగడం లేదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో నర్సరీలలో మొక్కలను సిద్ధం చేశారు. తొలకరి వర్షాలు కురవగానే నాటేందుకు క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ సిబ్బంది గుంతలు తీసే పనులు చేపట్టారు.
అయితే, వర్షాలు లేక గుంతలు తీయడానికి కూలీలు కూడా అవస్థలు పడుతున్నారు. మొక్కలు నాటితే వాటిని సంరక్షించడం కష్టమనే ఉద్దేశంతో అధికారులు మొక్కలు నాటేందుకు వెనకడుగు వేస్తున్నారు. వానలు కురిస్తేనే వనమహోత్సవం ఉత్సాహంగా కొనసాగుతుందని, లేనిపక్షంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం కష్టమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.












