Mancherial/Jaipur (అక్షరవేకువ) జూలై 11
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కు చెందిన ఎస్టిపిపి (జైపూర్) ఏరియాలో డీజీఎం (యాష్) గా పనిచేసి, బెల్లంపల్లి ఏరియా సేఫ్టీ ఆఫీసర్గా బదిలీ అయిన ఎనగందుల స్వామిరాజుకు ఎస్టిపిపి అధికారులు, ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికి, సన్మానించారు. ఈ సన్మానం జూలై 10న జరిగింది.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కు చెందిన ఎస్టిపిపి (జైపూర్) ఏరియాలో డీజీఎం (యాష్) గా విధులు నిర్వహించి, ఇటీవల బెల్లంపల్లి ఏరియా సేఫ్టీ ఆఫీసర్గా బదిలీ అయిన ఎనగందుల స్వామిరాజుకు ఎస్టిపిపి అధికారులు, ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికి, సన్మానించారు. ఈ కార్యక్రమం జూలై 10న జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎస్టిపిపి జనరల్ మేనేజర్ (జిఎం) ఎం. నరసింహారావు మాట్లాడుతూ, స్వామిరాజు సుమారు 11 నెలల పాటు ఎస్టిపిపిలో నిబద్ధతతో, అంకితభావంతో పనిచేశారని ప్రశంసించారు. ముఖ్యంగా ఫ్లై యాష్ వినియోగంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ప్లాంట్ ఉద్యోగులతో సౌమ్యంగా ఉంటూ, తోటి అధికారులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించారని గుర్తుచేశారు. ఉద్యోగులకు బదిలీలు సహజమని, ఎక్కడికి వెళ్లినా సింగరేణి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు.
సన్మాన గ్రహీత స్వామిరాజు మాట్లాడుతూ, ఇక్కడ విధి నిర్వహణలో తనకు పూర్తి స్థాయిలో సహకరించిన ప్రతి అధికారికి, ఉద్యోగికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ వీడ్కోలు సమావేశంలో ఎజిఎం (ఈ &ఎం) సూర్యనారాయణ రాజు, ఎజిఎం (ఫైనాన్స్) బి. శ్రీధర్, బ్రాంచ్ ప్రెసిడెంట్ డి. పంతులా, డిజిఎం (ఎన్విరాన్మెంట్) వాసుదేవ మూర్తి, ఎస్వో టు ఈడి వెంకటయ్య, ఎస్ఈ (ఈ &ఎం) కేవీ శ్రీనివాస్, ఫారెస్ట్ మేనేజర్ చంద్రమణి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకూర్ మోహన్ సింగ్తో పాటు పలువురు సింగరేణి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












