Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 08
హాజీపూర్ మండలం కర్ణమామిడి పంచాయతీలో బుధవారం ఎంపీఓఓ ఆవునూరి సుమన్ ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు.
ప్రజలు వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎంపీఓ ఆవునూరి సుమన్ కోరారు. బుధవారం హాజీపూర్ మండలం కర్ణమామిడి పంచాయతీ పరిధిలో ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. ఓటర్లు తెలిపిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూమయ్య, ఉపసర్పంచ్, సెక్రెటరీ శ్వేత, వార్డు సభ్యులు పాల్గొన్నారు.












