మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 12
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఆదిత్య న్యూరో ఎండి డిఎం న్యూరాలజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమైంది. మెదడు, వెన్నుముక నరాల సంబంధిత వ్యాధులకు మెరుగైన చికిత్స అందించే ఈ ఆసుపత్రిని మంచిర్యాల కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా జగన్నాథ్ లాడ్జ్ వద్ద నూతన ఆధునిక అన్ని అంగులతో, పేషెంట్లకు సరైన వైద్యంతో మెరుగైన చికిత్సలు అందించే ఆదిత్య న్యూరో ఎండి డిఎం న్యూరాలజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమైంది. నరకణజాలంపై మెరుగైన చికిత్స అందించడంతో పాటు, శరీరం దృఢంగా, బలంగా ఉండాలంటే నరాల బలోపేతం అత్యవసరమని, మెదడు, వెన్నుముక నరాల ఉత్తేజంపై దృష్టి సారించి చికిత్సలో మేటి సదుపాయంలో దీటుగా సేవలు అందిస్తామని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు.
న్యూరో ఫిజీషియన్ డాక్టర్ రోహన్ పూల, ఎండి వైద్యం అందించనున్నారు. ముఖ్యంగా పక్షవాతం, ఫిట్స్ పై సమగ్ర అవగాహన కలిగి, చికిత్సలపై ప్రత్యేక శిక్షణతో మంచిర్యాలలో సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆదివారం ఆదిత్య న్యూరో ఎండి డిఎం న్యూరాలజీ హాస్పిటల్‌ను మంచిర్యాల కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు లాంఛనంగా ప్రారంభించారు. మేయర్ మధుకర్, సిటీ అధ్యక్షులు తూముల నరేష్, కార్పొరేటర్ స్రవంతి కిషోర్ పాల్గొన్నారు. ఆస్పత్రిని పూర్తిగా పరిశీలించి, ప్రత్యేక గదులను సందర్శించి, పేషెంట్లకు అందించే చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు.
మంచిర్యాలలో అత్యాధునిక ఆదిత్య న్యూరో ఆసుపత్రి ప్రారంభం కావడం శుభపరిణామమని మేయర్ మధుకర్ అన్నారు. మెదడు, వెన్నుముక నరాల బలహీనత, కణజాల పనితీరుపై చికిత్సల కోసం హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి దూరప్రాంతాలకు వెళ్లకుండా, మంచిర్యాలలోనే పూర్తి స్థాయి చికిత్సలు, అన్ని రకాల వైద్య సేవలు ఆదిత్య ఎండి డిఎం న్యూరాలజీలో అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు. ఫిట్స్, పక్షవాతంపై ప్రత్యేక చికిత్సలు అందుబాటులోకి తేవడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి నిర్వాహకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.












