జైపూర్, 2026-06-28
జైపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూన భాస్కర్, ఉప సర్పంచ్ ఇరిగిరాల శ్రవణ్ కుమార్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు కేంద్రానికి వచ్చిన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ప్రజలకు సూచించారు.
జైపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూన భాస్కర్, ఉప సర్పంచ్ ఇరిగిరాల శ్రవణ్ కుమార్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు కేంద్రానికి వచ్చిన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ.. ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని గ్రామ ప్రజలకు సూచించారు. "ప్రతి చిన్నారికి రెండు చుక్కలు – పోలియో రహిత భారతదేశం మన లక్ష్యం" అనే ఉద్దేశంతో అందరూ బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.












