మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్నీ మధుకర్, 22వ డివిజన్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, అక్కడి సౌకర్యాలు, వైద్య సేవల తీరుతెన్నులను పరిశీలించారు.
మేయర్ ఆరోగ్య కేంద్రంలో వైద్యుల హాజరు రిజిస్టర్ను, అందుబాటులో ఉన్న వైద్య పరికరాలను, మందులను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు.
వైద్యులు రోగులకు సకాలంలో సేవలందించాలని, అవసరమైన అన్ని పరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉంచాలని, తీవ్రమైన కేసులను మాత్రమే ఉన్నత స్థాయి ఆసుపత్రులకు సిఫార్సు చేయాలని మేయర్ సూచించారు.
ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO) తో మేయర్ ఫోన్ ద్వారా సంప్రదించి, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.












