అక్షరవేకువ (అక్షరవేకువ) జూన్ 28
జిల్లాలో ఐదు సంవత్సరాలలోపు 76,367 మంది పిల్లలకు పల్స్ పోలియో టీకాలు వేశారు. ఈ కార్యక్రమం 459 కేంద్రాల ద్వారా 1836 మంది వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఎన్జీవోల సహకారంతో 70 వాహనాల సహాయంతో జరిగింది. తొలిసారిగా సూపర్వైజర్లు, వైద్యాధికారులు వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు.
జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఐదు సంవత్సరాలలోపు 76,367 మంది పిల్లలకు టీకాలు వేశారు. ఇందుకోసం 459 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయగా, 1836 మంది వైద్య సిబ్బంది, వైద్యులు, ఆశా కార్యకర్తలు, ఎన్జీవోల సహకారంతో 70 వాహనాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొట్టమొదటిసారిగా ప్రతి సూపర్వైజర్, వైద్యాధికారి తమ పల్స్ పోలియో వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర పర్యవేక్షకుడు శ్రీ శ్రవణ్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ఉపజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ అనిల్, డాక్టర్ అరుణ శ్రీ హాజరయ్యారు. జిల్లా పల్స్ పోలియో డిస్టిక్ టీం సభ్యులు కాకిరాల వెంకటేశ్వర్లు, ఆర్ఎస్ పద్మ, చారి, అఖిల్ పాషా, జిల్లా మాస్ మీడియా ప్రతినిధులు బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, రషీద్, సిహెచ్ఓ శ్రీ నాందేవ్, పుట్ట సత్తయ్య, శ్రీనివాస్, డిపిఓ ప్రశాంతి, వైద్యులు, వైద్య సిబ్బంది మారుమూల ప్రాంతాలలో ఆరోగ్య, ఆశా కార్యకర్తల ద్వారా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












