గత 10 నుంచి 12 ఏళ్లలో దేశంలో సుమారు 50 కోట్ల మంది ప్రజలు అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన నివేదికను ఉటంకిస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. గతంలో పేదరిక నిర్మూలన కేవలం నినాదాలు, ప్రకటనలకే పరిమితమైందని, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పేదరికాన్ని తగ్గించే చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.
గత 10 నుంచి 12 ఏళ్లలో దేశంలో సుమారు 50 కోట్ల మంది ప్రజలు అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన నివేదికను ఉటంకిస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. గతంలో పేదరిక నిర్మూలన కేవలం నినాదాలు, ప్రకటనలకే పరిమితమైందని, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పేదరికాన్ని తగ్గించే చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.
పుణేలో మూడో మెట్రో లైన్ (పింక్ లైన్)ను వర్చువల్గా ప్రారంభించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థికాభివృద్ధి, పేదరికం తగ్గుదల పరస్పరం సంబంధం కలిగిన అంశాలని ఆయన వివరించారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడులు పెంచడం, సంక్షేమ పథకాల ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారులకు అందించడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని ఆయన చెప్పారు.
ప్రపంచ బ్యాంకు నివేదికను ప్రస్తావించిన మోదీ
దేశంలో పేదరికం తగ్గుదలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. గత 1012 ఏళ్లలో సుమారు 50 కోట్ల మంది ప్రజలు అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారని ఆయన తెలిపారు. ప్రజలకు కేవలం ఆర్థిక సాయం అందించడం మాత్రమే కాకుండా, వారు తమ కాళ్లపై తాము నిలబడేలా సాధికారత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. పేదలకు అందాల్సిన నిధులు గతంలో అవినీతి, బంధుప్రీతి, ఇతర అక్రమాల కారణంగా మధ్యలోనే దారి మళ్లేవని, ప్రస్తుతం ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు చేరుతున్నాయని ఆయన వివరించారు.
పేదరికం తగ్గడానికి కారణాలివే..
పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మోదీ వివరించారు. పేదలకు ఇళ్ల నిర్మాణం, ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి సదుపాయం, ఇంటింటికీ కుళాయి నీటి సరఫరా, వంటగ్యాస్ కనెక్షన్ల పంపిణీ, రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాల అభివృద్ధి, విద్యుత్, గ్యాస్ పైప్లైన్ల విస్తరణ, సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ఆర్థిక ప్రయోజనాల అందజేత వంటివి ఇందులో ఉన్నాయి. ఈ సదుపాయాల వల్ల పేద కుటుంబాల సమయం ఆదా అవుతోందని, ఆ సమయాన్ని ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉపయోగించుకునే అవకాశం ఏర్పడుతోందని ప్రధాని వివరించారు.
పేదరికం తగ్గితే కొత్త మధ్యతరగతి ఆవిర్భావం
పేదరికం తగ్గడం వల్ల ప్రయోజనం ఒక్క కుటుంబానికే పరిమితం కాదని మోదీ అన్నారు. పేదరికం నుంచి బయటపడిన కుటుంబాలు కొత్త మధ్యతరగతిగా ఎదుగుతాయని ఆయన వివరించారు. వారి కొనుగోలు శక్తి పెరగడం వల్ల మార్కెట్లలో డిమాండ్ పెరుగుతుందని, దుకాణాలు, పరిశ్రమలు, తయారీ రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుందని ఆయన తెలిపారు.
పుణే మెట్రో పింక్ లైన్ ప్రారంభోత్సవంలో దేశవ్యాప్తంగా పట్టణ రవాణా వ్యవస్థలో వచ్చిన మార్పులను మోదీ వివరించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, 2014 నాటికి దేశంలో 248 కిలోమీటర్ల మెట్రో మార్గాలు ఉండగా, ప్రస్తుతం అవి సుమారు 1,200 కిలోమీటర్లకు విస్తరించాయి. 2014లో కేవలం 5 నగరాల్లో మాత్రమే మెట్రో సేవలు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 26 నగరాల్లో రోజుకు కోటి మందికి పైగా మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోని మూడు అతిపెద్ద మెట్రో నెట్వర్క్లలో ఒకటిగా ఎదిగిందని ప్రధాని పేర్కొన్నారు. మెట్రో రైళ్ల విస్తరణతో ప్రయాణ సమయం తగ్గుతుందని, ప్రజల ఉత్పాదకత పెరుగుతుందని ఆయన తెలిపారు.












