జూలై 22 (అక్షరవేకువ) జూలై 22
జూలై 22న జాతీయ పతాక ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా, లైన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G, రీజన్ 7 ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై, జాతీయ పతాక ప్రాముఖ్యతను వివరించారు.
జూలై 22 జాతీయ పతాక ఆవిష్కరణ దినోత్సవం (National Flag Adoption Day) పురస్కరించుకొని లైన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G, రీజన్ 7 ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320G సెకండ్ వాయిస్ డిస్టిక్ గవర్నర్ లయన్ ఉదారి చంద్రమోహన్, ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ వి మధుసూదన్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా రీసన్ చైర్ పర్సన్ లయన్ చక్రధర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మన జాతీయ పతాక ప్రాముఖ్యత గురించి వివరిస్తూ, 1947 జూలై 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య గారు రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని భారత రాజ్యాంగ సభ అధికారికంగా ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ రోజును జాతీయ పండగలా నిర్వహిస్తూ ప్రజలకు, విద్యార్థినీ విద్యార్థులకు తెలియజేస్తున్నామని వక్తలు వివరించారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాలను చేతబూని, జాతీయ గీతాలను ఆలపిస్తూ పురవీధుల గుండా ఐబి చౌరస్తా వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తుందని తెలియపరిచారు.
ఈ కార్యక్రమంలో జోన్ చైర్ పర్సన్ లయన్ దొంతుల ముఖేష్, లయన్ రాజేష్, రీసన్ పరిధిలోని పది క్లబ్బుల అధ్యక్ష కార్యదర్శులు మరియు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ మంచిర్యాల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దత్తత పాఠశాల సాయి కుంటలో విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేసి, త్రివర్ణ పతాకాలతో ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి ఫాతిమా, అధ్యాపకులు సాంబయ్య, లైన్స్ క్లబ్ సభ్యులు లయన్ వినయ్ కుమార్, ఇరుకుల ఆనంద్ పాల్గొన్నారు.









