భీమారం, 16 September
లంబాడీ హక్కుల పోరాట సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు భూక్యా రాజ్ కుమార్ నాయక్ మండల పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన వారిని అడ్డుకున్నారు. బంజారాలకు మంత్రి పదవి దక్కే వరకు పోరాటం ఆగదని నాయకులు తెలిపారు.
లంబాడీ హక్కుల పోరాట సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు భూక్యా రాజ్ కుమార్ నాయక్ మండల పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన వారిని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా భూక్యా రాజ్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, బంజారాలకు మంత్రి పదవి దక్కే వరకు మా పోరాటం ఆగదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. మా జాతి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం అని అన్నారు.
వారి ప్రధాన డిమాండ్లలో తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి, కులగణనలో లంబాడీల జనాభాను బహిర్గతం చేయాలి, లు సాగు చేస్తున్న భూములకు శాశ్వత పట్టాలు ఇవ్వాలి వంటివి ఉన్నాయి.
ప్రభుత్వం పెద్దలది రాక్షస ఆనందం అని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.












