సంగారెడ్డి పట్టణంలో జరుగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ పలు వినాయక మండపాలను సందర్శించారు. ప్రగతి అసోసియేషన్, వసంత్‌నగర్, పోతిరెడ్డిపల్లి వివేకానంద యూత్, వివేకానందనగర్ కాలనీలలోని మండపాలకు వెళ్లి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు అందుకున్నారు.
ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు, భక్తులు, యువత సాయినాథ్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు వినాయక మండపాల వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం అందించారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్న మండపాల నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడుతూ.. వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని చాటి చెప్పేలా నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. ఉత్సవాలను అందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లాడే మల్లేశం, శ్రవణ్ రెడ్డి, మోహన్ సింగ్ నాయక్, వెంకట్, మల్లేశం, గౌతమ్, దిలీప్, వాజిత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.












